24 April, 2026 | 1:25 AM

అగధలో శ్రవణ్‌రెడ్డి

24-04-2026 12:00 AM

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’.  కాశీ విశా లాక్షి బలుసు నిర్మిస్తున్నారు. ఇందులో ‘సింహ’ అనే కీలక పాత్రను శ్రవణ్‌రెడ్డి పోషిస్తున్న విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో శ్రవణ్‌రెడ్డి లుక్ చూస్తుంటే.. కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించడంలో అతను కీలక పాత్ర పోషిస్తాడని అర్థమవుతోంది.