బీసీసీఐ అనుమతి పత్రం చూపించండి
టీజీ20 లీగ్‌పై హెచ్‌సీఏకు టీసీఏ డిమాండ్
హైదరాబాద్, మే 8 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇటీవలే లాంఛ్ చేసి న టీజీ 20 లీగ్‌పై దుమారం రేగుతోంది. ఈ లీగ్ నిర్వహణపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరోసారి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనికి ఎ లాంటి అనుమతులు ఉన్నా యో రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ హెచ్‌సీఏను డి మాండ్ చేసింది. బీసీసీఐ అనుమతి పత్రం చూపించకుండా పదేపదే మీడియాలో బోర్డు ఆమోదం ఇచ్చినట్టు తప్పుడు ప్రచా రం చేస్తోందని ఆరోపించింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చూసి లీగ్‌లో పాల్గొంటున్న ప్లేయర్లు, అంపైర్లు, అధికారులు న్యా యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
టీజీ20 లీగ్ గ వర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటుకు హెచ్‌సీఏ జనరల్ బాడీ ఆమోదం తీసుకుందా లేదో వెల్లడించాలని డిమాండ్ చేసిం ది. బీసీసీఐ అనుమతి ఇచ్చిందని పేపర్ ప్రకటన రిలీజ్ చేయడం తప్పిస్తే దానికి సంబంధించి ఆధారాలు చూపడం లేద నీ టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కార్పొరేట్లను, ప్లేయర్స్‌ను, ఇతర అధికా రులను, స్పాన్సర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా పేర్కొన్నా రు. తెలంగాణ జిల్లాల్లో గత 12 ఏళ్లు టీసీఏ నిర్మించిన పటిష్టమైన వ్యవస్థ ఉందని, ఇది బీసీసీఐ నిబంధనల ప్రకారమే సాగుతోందన్నారు.
హైదరా బాద్ బయట జరిగే క్రికెట్ కార్యాకలాపాలకు టీసీఏతో సంప్రదించి కలిసి పనిచేయాలని 2021లో బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను హెచ్‌సీఏ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ పరిపాలనకు సంబంధించి బాంబే హైకోర్టులో విచారణ జరుగుతుండగా హెచ్‌సీఏ ఇష్టానుసారం వ్యవహరిస్తుండడం సరికాదన్నారు. వచ్చే నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభను గుర్తించేందుకు తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ప్రారంభించబోతున్నట్టు టీసీఏ ప్రకటించింది.






