గుర్తింపు లేకున్నా దేశం కోసం ఆడతాం
- క్రీడాసంస్కృతి పెరగాలన్న కిదాంబి శ్రీకాంత్
- సిటిజన్ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభించిన బ్యాడ్మింటన్ స్టార్
హైదరాబాద్, మే 8 : దేశంలో క్రీడాసంస్కృతి మరింత పెరగాలని భారత బ్యాడ్మింట న్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. ఇటీవల థామస్ ఉబెర్ కప్‌లో కాంస్యం గెలిచిన భారత షట్లర్లకు కనీస అభినందనలు కూడా లేకపోవడంపై స్పందించాడు. తమకు గుర్తింపు వచ్చినా రాకున్నా దేశం కోసమే ఆడతామన్నాడు. మెడల్స్ గెలిచినప్పుడే క్రికెటేతర క్రీడాకారులను గుర్తు పడతారనీ, అ యితే దేశం కోసం పతకాలు గెలవడమే తమ లక్ష్యమన్నాడు.
గత కొన్నేళ్లుగా బ్యా డ్మింటన్‌కు మంచి ఆదరణే లభిస్తుందని చె ప్పాడు. కూకట్‌పల్లి లేక్‌షోర్ మాల్‌లో సిటిజెన్ వాచెస్ ఇండియా సిటిజన్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను శ్రీకాంత్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా సిటిజన్ సంస్థ ఈకో డ్రైవ్ 50వ వార్షికోత్సవ మోడల్ ఈకో ఫోటాన్‌ను ఆవిష్కరించాడు. సిటిజన్ సంస్థ అభివృద్ధి చేసిన ఈకో టెక్నాలజీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యానికి అభినందనలు తెలియజేశాడు. ఫ్లాగ్ స్టోర్‌లోని సరికొత్త మోడల్స్‌ను శ్రీకాం త్ ఆసక్తిగా తిలకించాడు. ఈ కార్యక్రమంలో సిటిజెన్ వాచెస్ ఇండియా ఎండీ కావాటో ర్యోటా, కమల్ వాచెస్ కంపెనీ ఎండీ వేణుగోపాల్ టోట్లా తదితరులు పాల్గొన్నారు.






