calender_icon.png 13 February, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటగుళ్లకు శివరాత్రి శోభ

13-02-2026 12:37:13 AM

ఈనెల 15 నుండి 17 వరకు శివరాత్రి ఉత్సవాలు 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపే శ్వరాలయం కోట గుళ్ళు మహాశివరాత్రి శివ కళ్యాణ మహోత్సవానికి ముస్తాబవుతుంది. కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా శివరాత్రి మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మహాశివరాత్రికి మూడు రోజుల ఉత్సవాలు

శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల 15 ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం గణపతి పూజతో ఆలయ అర్చకులు గంగాధర్, నాగరాజులు పూజా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 15 రాత్రి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఎనిమిది గంటలకు శివ కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ధర్మకర్తలు అట్లూరి వెంకటలక్ష్మి నరసింహారావు పావన రాజ్యలక్ష్మి దంపతులు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ఇదే రోజు జాగరణ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

తెల్లవారు 16 ఉదయం స్వామివారికి మహా అన్నపూజ కార్యక్రమం జరగనుంది, అదేవిధంగా 17 మంగళవారం సాయంత్రం పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. కోటగుళ్ళు శివరాత్రి మహోత్సవాలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అదేవిధంగా ఆలయ పోషకులు నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పోతరాజు సాయి చైతన్య కీర్తి దంపతులు, లలిత నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ రాజేశ్వరప్రసాద్ లలిత దేవి దంపతులు డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు, భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ లక్ష్మీ దంపతులు, గంగాధర తహసిల్దార్ అంబటి రజిత సురేష్ దంపతులు శివ కళ్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు.