calender_icon.png 15 February, 2026 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్‌లో వైభవంగా శివపార్వతుల కళ్యాణం వేడుకలు

15-02-2026 06:39:06 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మహాశివరాత్రి పురస్కరించుకొని ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్ లో గల శ్రీ శివాలయంలో శివపార్వతుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. అర్చకులు వల్ల కొండ మఠం రమేష్, వల్లకొండ మఠం మహేష్ లు వేద మంత్రోచొరణాల మధ్య ఆ స్వామివారి వివాహ వేడుకలను ఘనంగా జరిపారు. చైర్మన్ అల్లంకి సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ శివపార్వతుల కళ్యాణ వేడుకల్లో ఆలయ డైరెక్టర్లు, దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.