16-02-2026 12:20:08 AM
పాల్గొన్న గ్రామసర్పంచ్ మానిపాటి శోభాకుమార్ ఉప సర్పంచ్ నుకంరాజు ముదిరాజ్
మంచాల, ఫిబ్రవరి 15: మండల పరిధిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో భక్తులరద్దీతో శివనామ స్వరంతో మారుమ్రోగిన శివాలయాలు. మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షచేసి వివిధ గ్రామాల్లోఉన్నశివాలయాలు వివిధ దేవాలయవద్దకు వెళ్లి శివలింగానికి ప్రత్యేక పూజలుచేసి ఉపవాస దీక్ష విరమించారు.
మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో శివాలయం ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణంకనుల పండుగగా అంగరంగ వైభవంగామహిళలకోలాటాల ఆటపాటలతో శివపార్వతుల కళ్యాణంఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా హాజరైన గ్రామసర్పంచ్ మానిపాటి శోభాకుమార్ ఉపసర్పంచ్ నూకంరాజుముదిరాజ్ వైస్సార్సీపీ మదగొని జంగయ్య గౌడ్ .
ఆరుట్ల రాజరాజేశ్వరి దేవాలయం నిర్మాణ దాత వెదిరె పాండు రంగారెడ్డి హాజరై శివపార్వతులకు ప్రత్యే కపూజలు నిర్వహించారుఆరుట్ల గౌడసంఘంఅధ్యక్షుడు తంగడిపల్లి నరేందర్ గౌడ్ ఉపాధ్యక్షు డు సుంకరిప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో కంఠమహేశ్వరస్వామి దేవాల యంలో శివలింగానికికంఠమ హేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప దేవాలయంలోఅయ్యప్ప గురుస్వామి కావలి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రత్యేకపూజలు నిర్వహించారు
ముదిరాజ్ సంఘంఅధ్యక్షుడు కావలి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పెద్దమ్మగుడి వద్దఉన్న శివలింగానికి ప్రత్యేకపూజలు నిర్వహిం చారు ఈకార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డుసభ్యులు కొండిగారిశ్రావణ్ పందిశేఖర్ అనంగాల్ల జగన్నాథం మంకుమమత వినోద్ మందమాధవి మోహన్ రెడ్డి పున్నంరాము రావులజంగయ్య మానిపాటి భానుప్రసాద్ మాడుగులబాలమని కృష్ణగౌడ్ మొర్రిపద్మఐలయ్య లాలగారి మణెమ్మ సాతిరిసత్యం దేవాలయ కమిటీ సభ్యులు వివిధ కులసంఘాల పెద్దలు, మాజీప్రజాప్రతినిధులు గ్రామస్తులు భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
మారుమోగిన ఆలయాలు
ఘట్ కేసర్, ఫిబ్రవరి15 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంతం పరిధిలోని పలు ఆలయాలు ఆదివారం శివనామస్మరణతో మారుమ్రోగాయి. ఉపవాస దీక్ష చేపట్టిన వేలాది మంది భక్తులు దీక్షను విరమించడానికి దేవా లయాలకు తరలిరావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
ఘట్ కేసర్ పట్టణ కేంద్రంలోని శ్రీస్వయంభూనాగలింగేస్వరస్వామి ఆలయం, శివారెడ్డిగూడా లోని శ్రీదండ్లగడ్డ ప్రససన్నాంజనేయస్వామి, ఎదులాబాద్ లోని శ్రీభ్ర మరాంబమల్లి ఖార్జునస్వా మి ఆలయం, పోచారంలోని శ్రీస్పటిక లింగేశ్వరస్వామి ఆలయాలతో పాటు పలు ప్రాంతాలలోని ఆలయాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి చేసిన శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి.
శివరాత్రికి అన్ని ఆలయాలను విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. పలువురు స్థానిక నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు కీసరగుట్టలో జరుగుతున్న శ్రీరామ లింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవ ఉత్సవాలకు ఆర్టీసీ వారు ఘట్ కేసర్ నుండి వేసిన ప్రత్యేక బస్సులలో తరలివెళ్ళారు.