6 March, 2026 | 3:41 AM

రాష్ట్ర కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

06-03-2026 01:43 AM
  1. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ

బెంగాల్‌కు ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రవి

తమిళనాడుకు ప్రస్తుత కేరళ గవర్నర్ అర్లేకర్

న్యూఢిల్లీ మార్చి 5: దేశంలోనే పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గురువారం కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్‌గా ప్రస్తుత హిమాచల్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను నియమించారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా.. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్‌ఎన్ రవి బదిలీ అయ్యారు. తమిళనాడుకు.. ప్రస్తుత కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను నియమించారు.

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సెనాను లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమించారు. హి మాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా.. లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కవిందర్ గుప్తాను, నాగా లాండ్ గవర్నర్‌గా నంద్‌కిషోర్ యాదవ్, బీహార్ గవర్నర్‌గా సయ్యద్ అతా హు స్సేన్ నియమితులయ్యారు.