26 April, 2026 | 11:19 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

07-03-2026 12:00 AM

సుంకాల సొమ్ము రీఫండ్ చేయాల్సిందే

ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు

వాషింగ్టన్, మార్చి 5: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దిగుమతులపై విధించిన సుంకాలను తిరిగి చెల్లించాల్సిందేనని ట్రేడ్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ విధించిన భారీ సుంకాలను సుప్రీం కోర్టు రద్దు చేసింది.

ఇకపై ఈ టారిఫ్‌ల వసూళ్లు నిలిపివేయాలని కోర్టు అధికారులకు ఆదేశించింది. వసూలు చేసిన సుంకాలను తిరిగి ఇవ్వాలా లేదా అన్న అంశంపై  తాజాగా ట్రేడ్ కోర్టు తీర్పుతో  స్పష్టత వచ్చింది. టారిఫ్‌ల పేరుతో వసూలు చేసిన సుమారు 130 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12 లక్షల కోట్లు)ను వడ్డీ సహా దిగుమతిదారులకు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. అట్మస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిష్ప విచారణ జరిపిన న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్, ఈ సుంకాలు చెల్లించిన దిగుమతిదారులు రీఫండ్ పొందేందుకు అర్హులని పేర్కొన్నారు.

అలాగే టారిఫ్‌ల రీఫండ్‌కు సంబంధించిన కేసులను తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై విధించిన సుంకాలు సాధారణంగా ‘లిక్విడేషన్’ అనే ప్రక్రియ ద్వారా ఖరారు అవుతాయి. ఈ ప్రక్రియలో కస్టమ్స్ అధికారులు నిర్ణయించిన సుంకాలపై దిగుమతిదారులు అభ్యం తరం వ్యక్తం చేయడానికి 180 రోజుల గడువు ఉంటుంది. ఆ గడువు దాటితే నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.