25 July, 2026 | 10:17 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన శాంతిఖని కార్మికుడు మంతెన భాస్కర్

30-05-2026 04:19 PM

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. గత ఫిబ్రవరి 2న హైదరాబాద్లోని జొరాస్ట్రియన్ క్లబ్ లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో జరిగిన సంగీత కార్యక్రమంలో 22 దేశాల నుంచి సుమారు 2000 మంది కీబోర్డు సంగీత వాయిద్యకారులు ఏకకాలంలో ప్రదర్శన నిర్వహించారు. అందులో ప్రతిభ కనపరచిన కొంతమందిని గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు.

అందులో బెల్లంపల్లి పట్టణానికి చెందిన  మంతెన భాస్కర్ ఉన్నారు. మంతెన భాస్కర్ హైదరాబాదు గచ్చిబౌలిలో విక్టరీ ఆడిటోరియంలో జరిగిన "గిన్నిస్ అచీవర్స్ మీట్" కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండంగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా భాస్కర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ మెడల్ అందుకున్నారు. భాస్కర్ కు పదేళ్ల వయసు ఉన్నప్పుడే 1996లో తండ్రి రాజయ్య శాంతిఖనిలో గని ప్రమాదంలో మృతి చెందారు.

అప్పట్నుంచి తల్లి పోసమ్మే నలుగురు పిల్లలను అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. సోదరుడు రమేష్  వారసత్వంగా వచ్చిన తండ్రి ఉద్యోగం చేపట్టి కుటుంబాన్ని పోషించారు. పిన్న వయసు నుంచి కష్టాలు,నష్టాలను చవిచూస్తూ  పెరిగిన భాస్కర్ బాగా చదువుకొని  సింగరేణి సంస్థలో 2018 లో ఇచ్చిన నోటిఫికేషన్ తో ఎలక్ట్రిషియన్ ఉద్యోగం సాధించాడు. 2018లో శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్ గా విధుల్లో చేరారు. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన భాస్కర్ ను శాంతిఖని గని అధికారులు, కార్మికులు, యూనియన్ నాయకులు, బంధుమిత్రులు ప్రశంసించారు.