9 May, 2026 | 3:40 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి

07-03-2026 12:00 AM

అధికారులకు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశం

షాద్నగర్, మార్చి 6 (విజయక్రాంతి): రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి, గ్రామాల్లో నెలకొన్న తాగునీటి పరిస్థి తిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని,పైప్లైన్ లీకేజీలు ఎక్కడైనా జరిగితే, సమాచారం అందిన వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని  ప్రతి మండలానికి సంబంధించి ’సమ్మర్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని ఆయన అధికారులకు సూచించారు.

అమృత్ స్కీమ్ కింద చేపడుతున్న నీటి ట్యాంకుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం తో పాటు మిగిలిపోయిన పైప్లైన్ మరియు ట్యాప్ కనెక్షన్లను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. పట్టణంలో పైప్లైన్, కేబుల్ తవ్వకాలు జరిపేటప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య తగిన సమన్వయం మరియు అనుమతులు ఉండాలని స్పష్టం చేశారు.సమీక్షా సమావేశంలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ లలిత, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కవిత, రోడ్లు భవనాల శాఖ ఈఈ రవీంద్ర, డిప్యూటీ ఈఈలు సందీప్, అబ్దుల్ బారి, మున్సిపల్ డీఈ నరేష్, పబ్లిక్ హెల్త్ డీఈ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.