calender_icon.png 4 February, 2026 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎఫ్డీఆర్ ప్రయోగం సక్సెస్

04-02-2026 01:42:59 AM

భారత అమ్ములపొదిలోకి మరో క్షిపణి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౩: భారత రక్షణ వ్యవస్థ అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. దేశ క్షిపణి వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు డీఆర్డీవో ప్రతిష్ఠాత్మకంగా తయారుచేసి న సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ క్షిపణి (ఎస్‌ఎఫ్డ్‌ఆర్)ని మంగళవారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ప్ర యోగించి సక్సెస్ అయింది. గగనతలం నుంచి గగనతలంలోకే ప్రయోగించేందుకు ఈ క్షిపణిని ఉపయోగపడుతుంది. ప్రయోగ పరీక్షలో అన్ని రకాల సాంకేతిక వ్యవస్థలు సక్రమంగా పనిచేశాయని డీఆర్డీవో వర్గాలు ప్రకటించాయి. క్షిపణి ద్వారా సుదూరంగా ఉన్న శత్రు దే శాల లక్ష్యాలను సులభంగా ఢీకొట్టవచ్చని తెలిపాయి. ప్రయోగానికి అనేక సంస్థలు సహాయ, సహకారాలు అందించాయని పేర్కొన్నాయి.