23 April, 2026 | 4:56 AM

మహిళలకు స్వయం ఉపాధి కోసమే కుట్టుమిషన్ కేంద్రాలు

23-04-2026 01:33 AM

మహిళాభివృద్ధి శ్రీధర్ బాబు లక్ష్యం

మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి  

మంథని, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ పరిధిలోని మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ తెలిపారు.

బుధవారం మున్సిపల్ పరిధిలోని గంగాపురి గ్రామంలో వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డితో కలిసి కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ప్రాంతాల్లోని మహిళలు ఉపాధి హామీ కోల్పోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి శ్రీధర్ బాబు మహిళల కొరకు ఈ పథకం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో శిక్షణ పొందినవారికి రాబోయే రోజుల్లో చక్కటి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు కుట్టే అవకాశం లభిస్తుందని తెలిపారు.

మంథని మున్సిపల్ పరిధిలో మూడు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం అయిందని ఇందులో శిక్షణ తీసుకుంటున్నవారికి భోజన సౌకర్యంతో పాటు మధ్యాహ్నం టీ స్నాక్స్ కూడా అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, అలీప్ ఆధ్వర్యంలో మహిళల స్వాలంబన కొరకు ఈ పథకం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారుపాక నిహారిక, పోతరవేణి రజిత, ఎరుకల స్రవంతి, జంబోజు శ్రీమతి,అలెప్ డైరెక్టర్ రమాదేవి, ఎంఎస్‌ఎంఈ తెప్పెల రజిత, వి దేవిక,  సిఓ లావణ్య, ఆర్పి లు శ్యామల, స్రవంతి, లక్ష్మీదేవి కే రజిత లు పాల్గొన్నారు.