21-02-2026 12:07:07 AM
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
మెదక్, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో సేవలాల్ మహారాజ్ 287 జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు సేవాలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడన్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడి వారి ఔన్నత్యానికి పునాదులు వేశారని సేవాలాల్ మహారాజులు కొనియాడారు.
శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజని, ఆయన చూపించిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నారు. ఈ ర్యాలీలు అదనపు కలెక్టర్ నగేష్ నిర్వాహకులతో నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.