calender_icon.png 21 February, 2026 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాద బాధితుడికి కొత్త జీవితం

21-02-2026 12:06:28 AM

అందించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్య బృందం

సికింద్రాబాద్, ఫిబ్రవరి 20(విజయక్రాం తి): తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో ప్రాణాపా య స్థితిలో ఆస్పత్రిలో చేరిన 41 ఏళ్ల రవి గోయెంకా  మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుల అత్యవసర చర్యలతో కొత్త జీవితం పొందారు. కోమా స్థితిలో ఐసీయూలో చేర్చబడిన ఆయ న, ప్రస్తుతం స్వయంగా నడుచుకుంటూ డిశ్చా ర్జ్ కావడం వైద్య బృందానికి ఆనందాన్ని కలిగించింది.

ప్రమాదంలో వాహనం కిందప డటంతో కుడి తుంటి ఎముక తీవ్రంగా విరగడంతో పాటు వెన్నెముక, పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. అధిక రక్తస్రావం కారణంగా పరిస్థితి అత్యంత విష మంగా మారింది. ట్రామా అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని మాట్లాడుతూ రోగి ఆస్పత్రికి చేరేసరికి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది.

తుంటి ఎముక పూర్తిగా చీలిపోవడం వల్ల శస్త్రచికిత్స చాలా సవాలుగా మారింది. మా బృం దం సుమారు 8 గంటలపాటు శ్రమించి ఎముకను పునర్నిర్మించింది. ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఆయన తిరిగి నడవగలిగేలా చేయడమే మా ముఖ్య లక్ష్యం అని తెలి పారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న సమయంలో ఆకస్మికంగా శ్వాసలో ఇబ్బంది తలెత్తింది.

వెంటనే కార్డియాలజీ విభాగం జోక్యం చేసుకుంది. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచులకంటి మాట్లాడుతూ, పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో ప్రమాదకరమైన రక్తపు గడ్డలు (పల్మనరీ ఎంబో లిజం) ఉన్నట్లు గుర్తించాం. ఆలస్యం చేయకుండా మెకానికల్ క్లాట్ రిమూవల్ విధానం ద్వారా గడ్డలను తొలగించాం.  క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్స్,  కార్డియాలజీ విభాగాల సమన్వయంతో అందించిన చికిత్స ఫలితంగా రవి గోయెంకా ప్రస్తుతం మెట్లు ఎక్కగలుగుతూ సాధారణ జీవితానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా రోగి రవి గోయెంకా తనను పూర్తిగా కొలుకొనేలా చేసిన మెడికవర్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో చీఫ్ అనస్థీషియా డాక్టర్ శ్రీనివాస్, క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీష్, సెంటర్ హెడ్ కృష్ణవేణి పాల్గొన్నారు.