26న పౌరాఘడ్‌కు సేవలాల్ దీక్షాదారులు
పాదరక్షలు లేకుండా మండుటెండలో 295 కిలో మీటర్ల మహా పాదయాత్ర
ఉట్నూర్, మార్చి 20 (విజయక్రాంతి): మండు టెండలో దైవభక్తి ఎంత దూరమైన నడిపిస్తుంది. అందుకు నిదర్శనం లంబాడా గిరిజన తెగలోని యువతీ.. యువకులు.. మహిళలు.. పురుషులు.. 41 రోజులు చేపట్టిన సేవాలాల్ దీక్ష విరమించుటకు కఠోర దీక్షతో మహా పాదయాత్ర చేపట్టారు. ఉగాది పర్వ దినోత్సవం రోజున కొమరం భీం జిల్లా సరిహద్దుతో పాటు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న శంకర్‌లొద్దిలోని శివాలయంలో మహా పూజ లు నిర్వహించి పాదయాత్ర చేపట్టారు.
అక్కడి నుండి నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్ మీదుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రా నికి చేరుకుంటారు. అనంతరం మహారాష్ట్రలోని పోరాదేవికి (జగదాంబ దేవి) దర్శనానికి బయలుదేరారు. మండుటెండలో పాదరక్షలు లేకుండా మహా పాదయాత్ర కొనసాగిస్తూ శంకర్ లొద్ది నుండి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండలం వాగాయి తండాకు శుక్రవారం చేరుకున్నారు.
ఇతర జిల్లాల లంబాడా గిరిజనులు..
మహాశివరాత్రి సందర్భంగా సేవాలాల్ దీక్ష తీసుకున్న భక్తులు శ్రీరామనవమి రోజున దీక్ష విరమించుటకు ఉగాది పర్వదినాన మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహా పాదయాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రమైన కర్ణాటక తదితర దూర ప్రాంతాల నుండి సేవాలాల్ దీక్ష చేపట్టిన భక్తులు పాదయాత్రగా బయలుదేరుతున్నారు.
పాదయాత్రగా బయలుదేరిన సేవాలాల్ దీక్షపరులకు లంబాడా తండాలో అతిథి సౌకర్యం కల్పిస్తూ.. వారికి భోజన సౌకర్యం కల్పిస్తున్నా రు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని వా గాయి తండాలో మహాపాదయాత్రగా బయలుదేరిన 4,000 సేవాలాల్ దీక్షపరులకు చవాన్ మంగులాల్, రాథోడ్ దేవరావు, రాథో డ్ సునీల్, ఈశ్వర్ నగర్ పంచాయతీ సర్పంచ్ రాథోడ్ శారద, ప్రభుత్వ ఉద్యోగులు దీక్షాపరులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
మొక్కులు తీర్చుకునేందుకు..
లంబాడాల ఆరాధ్య దైవం జగదాంబ దేవికి మొక్కులు తీర్చుకునేందుకు కామారెడ్డి జిల్లా నుంచి శంకర్‌లొద్దికి వచ్చి పూజలు నిర్వహిం చి పాదయాత్రలో పాల్గొన్నను. ప్రతి ఏ టా తమ జిల్లా నుంచి వందలాది మంది పాల్గొని మహా పాదయాత్రగా పోరా ఘ డ్‌కి వెళ్లి జగదాంబ దేవత మొక్కులు తీర్చుకుంటున్న. తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి సేవాలాల్ దీక్ష చేపట్టిన దీక్ష చేపట్టిన భక్తులను మండుటెండలో తమను దైవభక్తి నడిపిస్తుందన్నారు.
రాథోడ్ రాము, బిచ్కుంద, కామారెడ్డి జిల్లా




