ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
కోదాడ, మార్చి 20 : కోదాడ స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని పబ్లిక్ క్లబ్ నందు శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్వర్గీయ పైడిమర్రి జానకి గారి జ్ఞాపకార్థం, నిర్వాహకులు కోదాడ మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు మార్గదర్శకత్వంలో, హైదరాబాద్ యశోద హాస్పిటల్ (మలక్ పేట) సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.సుమారు 4,000 రూపాయల విలువైన పరీక్షలను రోగులకు ఉచితంగా నిర్వహించారు.
కార్డియాలజీ, డయాబెటిక్ మరియు ఆర్థో స్క్రీనింగ్ విభాగాలకు చెందిన నిపుణులు 500 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా పైడిమర్రి సత్తిబాబు మాట్లాడుతూ, సామాన్యులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే మెగా హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాస్ట్ సెక్రటరీ ప్రవీణ, రాజశేఖర్, ఓరుగంటి కిట్టు, ఉపాధ్యక్షులు సుధాకర్, పైడిమర్రి వెంకటనారాయణ, వ్యవస్థాపకులు గాదంశెట్టి శ్రీను, పైడిమర్రి నారాయణరావు, కొత్తూరు శ్రీనివాసరావు, మేళ్లచెరువు కిషోర్, ఇమ్మడి రమేష్, శంకర్ రావు,హనుమంతరావు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.




