నాణ్యతకు, మన్నికకు మారుపేరుగా సేవలు
నూతన ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవం
హన్వాడ, ఆగస్టు 23 (విజయక్రాంతి): వినియోగదారుల నమ్మకానికి మారుపేరుగా సేవలందిస్తామని శ్రీహరిచంద్ర ఫీల్లింగ్ స్టేషన్ యజమాని హరిచంద్ర అన్నారు.ఆదివారం హన్వాడ మండల కేంద్రంలో శ్రీ హరిచంద్ర నూతన పిల్లింగ్ స్టేషన్‌ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం శ్రీహరిచంద్ర మా స్టేషన్ లో సరిఅనా దేన్సిటీ పెట్రోల్ క్వాంటిటీ విషయంలో ఎలాంటి లోటు పాట్లు రానివ్వబోమని, మరి కొద్ది నెలల్లో ఈవీ ఛార్జింగ్, సీఎన్జీ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు.
ప్రతి ఒక్క వాహన దారులు తమకు పూర్తిస్థాయిలో సహకారం అందించి తాము అందించే నాణ్యతను వినియోగించుకోవాలని కోరారు.ఎల్లప్పుడు వినియోగదారులకు అందుబాటులో పెట్రోల్ బంకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు జాబులయ్య, శ్రీహరి చంద్ర మండల నాయకులున్నారు.






