7 July, 2026 | 2:03 AM

బాధ్యతతో ప్రజలకు అందించిన సేవలు

07-07-2026 01:00 AM
  1. ఎప్పటికీ గుర్తుండిపోతాయి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
  2. పదవి విరమణ పొందిన ఉద్యోగులను ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, జూలై6(విజయ క్రాంతి): ప్రభుత్వ ఉద్యోగం ఒక బాధ్యతతో కూడినదని, బాధ్యతతో ప్రజలకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జూన్ 30 నాటికి పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై ఉద్యోగుల సేవలను కొనియాడారు.

ఇంటర్మీడియట్ విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెనుబల్లిలో ప్రిన్సిపాల్గా పనిచేసిన సయ్యద్ యూసుఫ్, రెవెన్యూ శాఖలో తహసీల్దార్గా పనిచేసిన ఎస్.వి. నారాయణమూర్తి, హౌసింగ్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన పి. సాయిరాం రెడ్డి, పశుసంవర్ధక శాఖ పరిధిలో మధిర ఏరియా ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేసిన ఎస్. చంద్ర భగీరథి దేవి, రెవెన్యూ శాఖలో గిర్దావర్గా పనిచేసిన అల్లం రవికుమార్,

విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన షేక్ మదార్, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన అయూబ్ ఖాన్, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేసిన కె. వెంకన్న, గిరిజన సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన షేక్ హసన్ పాషా, ఆఫీస్ సబార్డినేట్గా పనిచేసిన తేజావత్ పెంటయ్య, జిల్లా ఉపాధి కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేసిన ఎం. సిద్దిక్ పదవీ విరమణ పొందారు. 

పదవి విరమణ పొందిన ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కొనసాగాలని కోరుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.