16 June, 2026 | 7:09 PM

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసిన సర్పంచ్

16-06-2026 06:26 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి, ధర్మారెడ్డి గ్రామాలలో గల గల ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసినట్లు గ్రామ సర్పంచ్లు పెద్దపట్లలో సునంద కిషన్ రెడ్డి,గులపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం ఒకటవ తరగతి విద్యార్థులకు సామాజిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగిందన్నారు. అంగన్వాడి సెంటర్లో పిల్లలకు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ... గ్రామాలలోని పిల్లలు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సదుపాయాలు, మంచి విద్య, మంచి భోజనం అందజేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు సునంద కిషన్ రెడ్డి, లక్ష్మీనారాయణ,ధర్మ రెడ్డి ఉపసర్పంచ్ జయరాజ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.