23 May, 2026 | 4:55 PM

ఖానాపూర్‌లో నూతన బేకరీ ప్రారంభోత్సవం

23-05-2026 03:45 PM

హాజరైన బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో నూతన బేకరీ శనివారం ప్రారంభించారు. ఈ బేకరీ ని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన రిబ్బన్, కేక్ కట్ చేసి ఈ బేకరీ ని ప్రారంభించారు. నిర్వాహకులు లక్కీ శేఖర్ వారి కుటుంబాన్ని ఆయన అభినందిస్తూ అనతి కాలంలోనే బేకరీ మంచి పేరు సాధించాలని ఆయన ఆశించారు .కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.