2 September, 2026 | 12:23 PM

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ఛార్జిషీట్

02-09-2026 | 11:26am

హైదరాబాద్: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఆ పార్టీ పాలనపై ఛార్జిషీట్‌ను విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యం, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. ఇదే అంశంపై బీఆర్‌ఎస్‌ వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.