2 September, 2026 | 1:09 PM

దివంగత సీఎం వైఎస్ఆర్ నివాళులర్పించిన సీఎం రేవంత్

02-09-2026 | 11:13am

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Late Chief Minister Dr. YS Rajasekhara Reddy) 17వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేసుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పేదలకు గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచిన ప్రజానాయకుడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.