2 September, 2026 | 12:32 PM

కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

02-09-2026 | 11:38am

హైదరాబాద్: కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపిస్తూ.. మంత్రులు, ముఖ్యమంత్రులు తన్నుకుంటూ కుక్కలు చింపిన విస్తరిలా అయింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసమర్థత ప్రోమ్యాక్స్‌, అవినీతి అల్ట్రామ్యాక్స్‌, అరాచకం ఐమ్యాక్స్‌ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress government)పై కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.

రైతు రుణమాఫీపై స్పందిస్తూ.. రూ.50 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, రూ.20 వేల కోట్లతోనే ముగించారని ఆరోపించారు. దేవుళ్లపై ఒట్లు పెట్టి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. యూరియా కోసం ప్రశ్నించిన రైతులకు సంకెళ్లు వేసి, ఆస్పత్రి బెడ్‌కు కట్టేశారని కేటీఆర్‌ ఆరోపించారు. నీళ్లు అడిగితే కోసి రక్తం చల్లమని చెప్పారు అంటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.