2 September, 2026 | 11:49 AM

సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్యనేతలంతా ఢిల్లీలోనే మకాం

02-09-2026 | 11:00am

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సహా ముఖ్యనేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్వీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ ఢిల్లీలోనే ఉండగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇవాళ వెళ్లనున్నారు.

కేసీ వేణుగోపాల్(KC Venugopal) తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గంటన్నరపాటు చర్చించి, రాష్ట్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన, రాజకీయ పరిస్థితులను వివరించారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై, మంత్రివర్గ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. సీఎం రేవంత్ కొండా సురేఖ అంశాన్ని  కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో ఏఐసీసీ అధిష్టానం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. బుధవారం ముఖ్యమంత్రి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ లతో కేసీ వేణుగోపాల్ మరోసారి భేటీ కానున్నారు. క్రమశిక్షణ సంఘం నివేదికపై మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.