2 September, 2026 | 12:51 PM

టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు

02-09-2026 | 11:48am

తిరుపతి: టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు(ACB officials)సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి(Tirupati)లోని పెద్దకాపు లేఔట్‌లో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ(ACB)తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాల సమయంలో లోకనాథం ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం.

అదే సమయంలో తిరుమలలోని లోకనాథం కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంటితో పాటు కార్యాలయంలోనూ ఏకకాలంలో జరుగుతున్న తనిఖీలతో టీటీడీలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సోదాలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.