5 April, 2026 | 4:21 AM

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

05-04-2026 12:16 AM

పబ్ పార్టీల నుంచి డ్రగ్స్ విందుల వరకు,కాల్ గర్ల్స్ అనుమానం

మొయినాబాద్ ఏప్రిల్ 4(విజయ క్రాంతి) : మొయినాబాద్ ఫార్మ్హౌస్లో జరిగిన డ్రగ్స్, కాల్పుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 14న వెలుగులోకి వచ్చిన ఈ కేసులో నిందితుల కార్యకలాపాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతుగా విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా, ప్రధాన నిందితుడైన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు ఇతర నిందితులు ఘటనకు ముందు రోజు కూడా పార్టీ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నెల 13న హైదరాబాద్లోని ఓ పబ్లో ఎంజాయ్ చేసిన అనంతరం మళ్లీ ఫాంహౌస్‌కు చేరుకుని విందులు నిర్వహించినట్లు సమాచారం.

అదే రోజు ఢిల్లీ నుంచి వచ్చిన నమిత్ శర్మను రోహిత్ రెడ్డి నగరంలోని ఓ హోటల్కు తీసుకెళ్లి, అక్కడి నుంచి పబ్కు వెళ్లినట్లు దర్యా ప్తులో తేలింది. పబ్లో ఇద్దరు రాజకీయ నా యకులు కూడా వీరితో కలిసి పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అనంతరం అందరూ కలిసి మొయినాబాద్ ఫాం హౌస్‌కు చేరుకున్నారు. ఈ పార్టీలకు కొంద రు వ్యక్తులు మహిళలను కూడా వెంట తీసుకువచ్చినట్లు సమాచారం. కాల్ గరల్స్ పా ల్గొన్నారనే అనుమానంతో పోలీసులు విచారణను మరింత విస్తరించారు. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

2024 సంవత్సరం నుంచి ఈ ఫాంహౌస్‌లో కనీసం 8 సార్లు పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అదుపులోకి తీసుకోగా, విచారణ లో మరో 15 మంది పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం.ప్రధాన నిందితులు రోహి త్‌రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మలను సిట్ అధికారులు శుక్రవారం కూడా విచారించారు. రోహిత్ రెడ్డికి దుబాయ్, జాంబియా, బ్రిటన్లలో వ్యాపారాలు ఉన్నట్లు, గత ఐదు నెల ల్లో పది సార్లు దుబాయ్ వెళ్లినట్లు గుర్తించారు.

అక్కడే డ్రగ్స్ మాఫియాతో పరిచ యాలు ఏర్పడ్డాయని అనుమానం వ్యక్తమవుతోంది.ఇక నిందితుల పోలీస్ కస్టడీ శుక్రవారంతో ముగియడంతో శనివారం కోర్టు లో హాజరుపరిచి అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. మరో మూడు రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.