డంప్ యార్డ్‌పై కొట్లాడుతున్నా..
- వారం రోజుల్లో పార్లమెంట్ సభ్యుల బృందంతో ఉద్యమం చేయబోతున్నాం
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హుజురాబాద్, ఏప్రిల్4(విజయక్రాంతి): హుజురాబాద్‌లో డంప్ యార్డ్ పెట్టి ఈ ప్రాంతాన్ని విషతుల్యం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనకు వ్యతిరేకంగా హుజురాబాద్ దాని పక్కన ఉన్న గ్రామాలు ప్రజలు ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ గా ఏర్పడి చేస్తున్న ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.
నాకు యాక్షన్ రాదు.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే వస్తుంది.. దీక్ష చేస్తున్నారని తెలియగానే నేను తప్పకుండా వస్తా అని వచ్చాను ఎంపీ ఈటల అన్నారు. నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదని ఏ ప్రభుత్వం ఇచ్చింది.. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనే రాజకీయాలు మాట్లాడానికి రాలేదని అన్నారు.
దేశంలో అతి దుర్మా ర్గపు ఘటన.. లక్షల ప్రజల జీవితాలతో చెల గాటమాడుతూ 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు అనేక రకాల రోగాలకు కారణమవుతున్న జవహార్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్‌కు సజీవ సాక్ష్యం నేనే. దానికి వ్యతిరేకంగా ఎంపీ అయిన తర్వాత అనేకసార్లు ఉద్యమాలు చేశానని అన్నారు. మీలా గా జేఏసీలు ఏర్పడి కోర్టుకు పోతే దబాయిస్తున్నారని చెప్పి స్వయంగా పార్లమెంట్ సభ్యుడిగా సుప్రీంకోర్టులో నేనే కేసు వేశాను అని వివరించారు.
దానిపైన నేను కొట్లాడుతున్న.. వారం రోజుల్లో మొత్తం పార్లమెంట్ సభ్యుల బృందం తోటి దానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేయబోతున్నాం అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.హుజురాబాద్‌లోని మొత్తం చెత్తంతా తీసుకొని కరెంటు తయా రు చేస్తానని మిషన్లు పెడుతున్నారు... అవి పేరుకే పెడుతున్నారు తప్ప పని చేయవన్నారు.
ఆ మిషన్లు నడుస్తున్నప్పుడు భయం కరమైన శబ్దాలు వస్తాయని అది మొదలైన తర్వాత పది పదిహేను కిలోమీటర్లలో భూగర్భ జలాలు, చెరువుల్లో మొత్తం సర్వనాశనం అవుతాయని, బోర్లు వేస్తే పచ్చటి నీరు వస్తాయని వాటితో భోజనం చేసుకోలేమని, ముఖాలు కూడా కడుక్కోలేమన్నారు.




