13 May, 2026 | 1:01 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం

08-02-2026 01:44 AM

-మంత్రి శ్రీధర్‌బాబు, శ్రీనుబాబుల సహకారంతో సంక్షేమ ఫలాలు అందిస్తాం

-మంథని5వ వార్డులో ఎన్నికల ప్రచారంలో సీనియర్ వకీల్‌సాబ్ మహేందర్‌రెడ్డి

మంథని, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): మంథని మున్సిపల్ 5వ వార్డు లో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, మహిళలకు ప్రతి నెల ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని, మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబుల సహకారంతో పేదవారికి సంక్షేమ ఫలాలు అందిజేస్తామని శనివారం ఐదో వార్డులో ఎన్నికల ప్రచారంలో సీనియర్ వకీల్ సాబ్ మహేందర్‌రెడ్డి అన్నారు.అలాగే ఈ వార్డులో ఉన్న మురికి కాలువలను శుభ్రం చేసి కొత్తవి నిర్మిస్తామన్నారు.

తాను మంథనిలోని కూరాగాయల మార్కెట్ సమీపంలోనే  ఉంటానని ఏ చిన్న పనిబడ్డ ప్రతిరోజు తనను కలవవచ్చని తెలిపారు. అలాగే శ్రీరామ్ నగర్, కూచిరాజ్ పల్లి, గంగాపురి, గొల్లగూడెం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు అందుబాటులో ఉన్నారని, వారికి సమాచారం ఇచ్చిన తన దృష్టికి తీసుకు వస్తారని నిరంతరం ప్రజల సేవ కోసమే తమ కుటుంబం పనిచేస్తుందని మహేందర్ రెడ్డి ప్రజలకు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.