వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ
13-05-2026 12:08 PM
భిక్కనూర్, మే14(విజయ క్రాంతి): భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలోని కంచర్ల, మల్లుపల్లి, పెద్దమల్లారెడ్డి వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు, కార్మికులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వడగాలులు, వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తగినంత నీరు తాగాలని, ఎండలో ఎక్కువసేపు పనిచేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు






