13 May, 2026 | 11:58 AM

Breaking News

షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!

13-05-2026 11:22 AM

అదుపు తప్పిన భారీ లారీ బీభత్సం.. కారు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం

షాద్‌నగర్, మే 13 (విజయక్రాంతి): షాద్‌నగర్ బైపాస్ రోడ్డులోని కేశంపేట్ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ భారీ లారీ ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో అధిక వేగంతో అదుపుతప్పి ముందుగా ఓ కారును ఢీకొట్టి, అనంతరం డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత అక్కడే ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడ ఐస్‌క్రీమ్ విక్రయానికి వచ్చిన ద్విచక్ర వాహనం సహా మరో బైక్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో కొంతమంది గాయపడినప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.