11 March, 2026 | 3:13 PM

Breaking News

ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •  

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

11-03-2026 12:48 AM

నాగల్ గిద్ద, మార్చి 10: నాగల్ గిద్ద మండల పరిధిలోని గంగారం తాండ గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి మన్మధ కిషోర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలో టిఎల్‌ఎం ఏ ర్పాటు చేయడం అద్భుతమని, ఎక్కడ కూడా ఈ విధంగా టీఎల్‌ఎం ఏర్పాటు చేయలేదని తెలిపారు.

పాఠశాలను ఇంత చక్కగా తయారుచేసిన ప్రధాన ఉపాధ్యాయులు తులసి రావు, మా నసను అభినందించారు. కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ రావు, పిఆర్టి యు మండల అధ్యక్షులు శేరికర్ రమేష్, ప్రధాన కార్యదర్శి నాగనాథ్, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సూర్యకాంత్, గ్రామ సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి గోపాల్ రెడ్డి, మండల స్ట్రాంగ్ టీచర్ రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.