11 March, 2026 | 4:44 PM

Breaking News

మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మృతిపై సంతాపం   •   ఒత్తిడిని వీడి.. పరీక్షలకు సిద్ధం కావాలి: ఏఎస్పీ   •   వాడి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం   •   కుంభాభిషేకం – తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు   •   హేమలత చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే తలసాని   •   విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   సెన్సెక్స్ 1342 పాయింట్లు కుప్పకూలింది.. పెట్టుబడిదారులకు రూ.3 లక్షల కోట్ల షాక్ — కారణం ఇదే!   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •  

ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు

11-03-2026 03:10 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 

సదాశివనగర్,(విజయక్రాంతి): రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయాన్ని చేస్తే అధిక లాభాలు ఆశించవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పజా పాలనా ప్రగతి ప్రణళిక కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటలలో నానో యూరియాను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు.

ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి,మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రజాప్రతి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు