11 March, 2026 | 4:49 PM

Breaking News

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి   •   మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మృతిపై సంతాపం   •   ఒత్తిడిని వీడి.. పరీక్షలకు సిద్ధం కావాలి: ఏఎస్పీ   •   వాడి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం   •   కుంభాభిషేకం – తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు   •   హేమలత చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే తలసాని   •   విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   సెన్సెక్స్ 1342 పాయింట్లు కుప్పకూలింది.. పెట్టుబడిదారులకు రూ.3 లక్షల కోట్ల షాక్ — కారణం ఇదే!   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •  

మహిళ దారుణ హత్య..

11-03-2026 12:47 AM

హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

కేసు నమోదు చేసిన పోలీసులు

పాపన్నపేట,మార్చి10: మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన ఏడుపాయల ఆలయం సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని కొడుపాక గ్రామానికి చెందిన బ్యాగరి సులోచన(35) కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో అప్పటి నుంచి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. మెదక్ లో కూలీ పనులకు వెళ్తూ జీవిస్తుంది. కాగా సోమవారం ఉదయం ఇంట్లో నుంచి కూలీ పనుల కోసం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.

దీంతో ఇంటి వద్ద ఉన్న కుమారుడు రాజేష్ బంధువులకు సమాచారం అందించాడు. చుట్టూ పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఏడుపాయల సమీపంలోని చెలిమకుంట వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి ముఖంపై కర్రతో దాడి చేసిన బలమైన గాయం ఉండడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతురాలి సోదరుడు దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.