6 July, 2026 | 3:57 PM

Breaking News

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •  

రాష్ట్రంలోనే వంద శాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండవ గ్రామం సోమ్లా నాయక్ తండా

05-05-2026 07:59 PM

బాన్సువాడ డివిజన్ లో మొదటి గ్రామంగా రికార్డు

తహసిల్దార్ రాజ్ నరేందర్ గౌడ్ వెల్లడి

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సోమ్లా నాయక్ తండా స్వీయ గణనలో విశేష విజయాన్ని సాధించింది. రాష్ట్రంలోనే వందశాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండో గ్రామంగా, బాన్సువాడ డివిజన్ లోనే మొదటి గ్రామంగా సోమ్లా నాయక్ తండా రికార్డు సృష్టించింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచనల మేరకు మండల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామ ప్రజలకు స్వీయ గణనపై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు.

దీనివల్ల గ్రామస్థులు ఉత్సాహంగా ముందుకు వచ్చి స్వీయ గణన ప్రక్రియను పూర్తిగా విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్​ రాజ్ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ మండల, రెవెన్యూ, పంచాయతీ అధికారులు, ఉపాధ్యాయుల సమష్టి కృషి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని తెలిపారు. మంగళవారం నాటికి గ్రామంలో వంద శాతం స్వీయ గణన పూర్తయిందని ఆయన వెల్లడించారు. గ్రామ ప్రజల చైతన్యం, అధికారుల కృషి కలిసొచ్చి సాధించిన ఈ విజయాన్ని స్థానికంగా అభినందిస్తున్నారు. ఇతర గ్రామాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.