జిల్లాలో స్వీయ గణన ప్రారంభం
- ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : జనగణన-2027లో భాగంగా ఆదివారం స్వీయ గణన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో జనగణన అధికారులతో సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లా డారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన జరగనున్న నేపథ్యంలో ఆదివారం కార్యక్రమాన్ని ప్రారంభించి తాను వివరాలను పోర్టల్ లో నమోదు చేశానన్నారు.
మే 10 వరకు ఆన్ లైన్ లో https: //sc.census.gov.in వెబ్ సైట్ ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చని, ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నెంబర్ వినియోగించాలని, ఇండ్ల గణనకు సంబంధించి 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి రివ్యూ ద్వారా పరిశీలించుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలు నింపిన తరువాత సబ్మిట్ చేయడంతో హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల సంఖ్యతో ఐ.డి. వస్తుందని, ఈ సంఖ్యను నమోదు చేసి భద్రపరచుకోవాలని తెలిపారు.
మే 11 నుంచి ఇండ్ల గణన అధికారు లు కార్యక్రమంలో భాగంగా ఇంటికి వచ్చినప్పుడు ఈ నెంబర్ ను అందించాలన్నారు. ఆ సమయంలో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే ఎన్యుమరేటర్ ద్వారా సవరించు కోవచ్చని, జన గణన కోసం అధికారులు వచ్చిన సమయంలో ప్రజలు వాస్త వ సమాచారాన్ని అందించాలని కోరారు.
మొదటి రోజే జిల్లాలో వెయ్యి మంది వరకు తమ వివరాలను నమోదు చేశారన్నారు. స్వీయ గణన కార్యక్రమం నిర్వహణలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖ వ్య క్తులు, గణన అధికారులు, యువత, స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలని తెలిపారు.
ఘనంగా వాసవి మాత జయంతి
వాసవి మాత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో ఏర్పా టు చేసిన వాసవి మాత జయంతి ఉత్సవాలకు కలెక్టర్ కుమార్ దీపక్ సతీ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి మాత జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
ఈ వేడుకలలో వాసవి క్లబ్ జాతీయ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, రాజేష్, హరీష్, వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ బాలమోహన్, క్యాబినెట్ సెక్రెటరీ సేవా కేశెట్టి వంశీకృష్ణ, క్యాబినెట్ కోశాధికారి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు మాదంశెట్టి సత్యనారాయణ, చిలువేరు జ్యోతి శ్రీనివాస్, వాసవి క్లబ్ నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.






