21 March, 2026 | 9:15 PM

జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక

20-03-2026 12:00 AM

మంచిర్యాల, మార్చి 19 (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణానికి చెంది న బోనగిరి శ్రీహర్షవర్ధన్ జాతీయస్థా యి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరు సుధాకర్ తెలిపారు. ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు హైదరాబాద్ లో జరిగిన మాస్టర్స్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థా యి పోటీలలో  హైదరాబాద్ కు చెంది న రేష్మ మన జిల్లా క్రీడాకారుడు  శ్రీహర్షవర్ధన్‌లు పాల్గొని ఫైనల్‌కు చేరుకొని రన్నర్స్‌గా నిలిచారు.

మార్చి 21 నుంచి 25 వరకు గోవాలో జరగనున్న జాతీ య స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలలో శ్రీహర్షవర్ధన్ పాల్గొననున్నట్టు తెలిపారు. జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన శ్రీహర్షవర్ధన్ ను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్, ఉపాధ్య క్షులు భాస్కర్ల వాసు, మీనా రెడ్డి, ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రమేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు తదితరులు అభినందించారు.