నిలువెత్తు సాహిత్య కావ్యం సీతారాం
రావులపాటి సీతారాం ఆధునిక తెలుగు సాహిత్య జ గత్తులో నాలుగు దశాబ్దాలుగా కవిగా విమర్శకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, తెలుగు అధ్యాపకుడిగా సుప్రసిద్ధుడు. డాక్టర్ రావులపాటి సీతారాం శైలి, శిల్పం ఒక శ్రీశ్రీ, ఒక శివారెడ్డి కవిత్వంలా ఒక ప్రత్యేకమైన ధ్వని. ఒక సం చలనం. సీతారాం ‘రక్తస్పర్శ’, ‘ఇదిగో ఇక్కడిదాకే’, ‘సన్నాఫ్ మాణిక్యం’, ‘కుప్పం కవితలు’, ‘అదేపాట’ ‘సాహిత్య విమర్శ’, ‘మానుకోట ముచ్చటు’్ల, ‘కారేపల్లి కబుర్లు’, ‘ఆ ముగ్గురు సరే -మనమాటేమిటి?’ అనే పుస్తకాలను వెలువరించారు.
తాను సన్నాఫ్ మాణిక్యం అని సగర్వంగా ప్రకటించుకున్న కవి ఈ యన. సీతారాం 1964 ఖమ్మం జిల్లా ఆరెంపుల గ్రామంలో నారాయణ, మాణిక్యం దంపతులకు జన్మించారు. పదో తరగతి, డిగ్రీ ఖమ్మంలో పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాల యంలో ‘ఆధునిక కవితా ధోరణులు’ అనే అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. సీతారాం నూనుగు మీసాల ప్రాయంలోనే కవిత్వాన్ని అందుకున్నారు. నవ యౌవన ప్రాయంలోనే తోటి కవి మిత్రులతో తన కవితల సంకలనాలు అచ్చేశారు.
ఆయన 1998లో ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలోని బనిగండ్ల పాడు జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అధ్యాపకత్వం నిర్వహించి, 2025లో ఉద్యోగ విరమణ పొందారు. సీతారాంకు కవిత్వం, జీవితం వేర్వేరు కాదు. ఆ రెండు తెరిచిన పుస్తకాలు. ఆయన రాత, ఆచరణ ఒకే విధంగా ఉంటుంది. సీతారాం విస్తృతమైన తెలుగు సాహిత్యాన్ని చదువుకున్నారు.
ప్రపంచ సాహిత్య విమర్శనూ అధ్యయనం చేశారు. సీతారాం వంటి ఉపాధ్యాయుడు సమాజంలో అరుదుగా కనిపిస్తుంటారు. ఒకవైపు పిల్లలకు పాఠాలు బోధిస్తూ నే, ఆయన రచనా వ్యాసాంగాన్నీ కొనసాగిస్తున్నారు. అంతేకాదు& నేటి తరాన్ని కూడా ఆ మార్గంలో నడిపించేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు. విద్యార్థులను రచయితలుగా, కవులుగా తీర్చిదిద్దుతున్నారు. సీతారాం సామాజిక ఉద్యమా ల్లోనూ క్రీయాశీలకంగా పనిచేశారు. మానవ జీవితాలను ఎయిడ్స్ కబళిస్తున్నప్పుడు, వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించారు.
‘ఆశ’ ప్రాజెక్టు రూపకల్పనలో పాలుపంచుకున్నారు. తన రచ న ‘అదేపాట’ను ఎయిడ్స్ బాధితులకు అంకితమిచ్చారు. ఇం కా గొప్ప విషయం ఏమిటంటే ఎయిడ్స్ బాధితులందరినీ సమీకరించి ఓ ఆలయ ప్రాంగణంలో ప్రముఖ కవులతో స న్మానం చేయించారు. రాజీవ్‌బండ ముంపు బాధితుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. తానే దగ్గరుండి మరీ వారికి భోజన వసతులు కల్పించారు. ఇలాంటి ఎన్నో మానవీయ కార్యక్రమాల్లో సీతారాం ప్రత్యక్ష భాగస్వామి.
రేపటి తరం భవిష్యత్తుపై తపన
సీతారాం విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టేందుకు నిత్యం తపన చెందుతూ ఉంటారు. విద్యార్థులను సమాయత్తం చేస్తూ తరగతి గదుల్లో కవిత్వ నిర్మాణానికి పాదులు వేస్తారు. తాను ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పాఠాలు బోధిస్తే ఆ పేర్లను తన కవితా సంపుటాలకు వినియోగిస్తుంటారు. అలా వెలువరించినవే ‘మానుకోట ముచ్చట్లు’, ‘కారే పల్లి కబుర్లు’, ‘కుప్పం కవితలు’. ‘మానుకోట ముచ్చట్లు’ అనే సంకలనంలో ‘మనం చూడబడుతున్నాం’ అనే వ్యాసంలో ‘ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు పాఠాలు చెప్పరు.
విధులకు హాజరు కారు. బడి ఎగ్గొడతారు. పంఖాల కింద సేదతీరుతారు. పిల్లల్ని పట్టించుకోరు. జీతాలు మాత్రం తీసుకుంటారు. అందువల్లనే ప్రభుత్వం విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచింది. ఒక్క విద్యారంగం గురించే కాదు. పబ్లిక్ ఫండింగ్‌తో నడిచే అన్ని సంస్థల ఉద్యోగుల మీద కూడా ఇటువంటి అభిప్రాయాలే సమాజంలో చలామణిలో ఉన్నాయి. వీటిని తుడిచివేసి చెరిపేసి, కొత్త చరిత్రను రాయాల్సింది మనమే కదా’ అని రాశరంటే సీతారం ఎంతటి ధీశాలో అర్థం చేసుకోవచ్చు.
‘కారేపల్లి కబుర్లు’ పుస్తకం ముందుమాటలో..
‘కారేపల్లి కబుర్లు’ పుస్తకం ముందుమాటలో ‘ప్రభుత్వ కళాశాలలకు బ్రాండ్ ఇమేజ్ తేవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఆయా కళాశాలల్లో పని చేస్తున్న వారు ఒక ఉమ్మడి లక్ష్యం ఏర్పరచుకుంటే చాలు. పిల్లలపై జాలి, కనికరం కాదు చూపాల్సింది. వాటికంటే కూడా వారి పట్ల గౌరవభావం ఉంటే చాలు. మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నవాళ్లమే. ఇప్పుడిలా కావడానికి ఎంతోమంది అధ్యాపకులు నించున్న ఫూలే అంబేడ్కర్, అబ్దుల్ కలామ్, అమర్త్యసేన్ అని భావిస్తే చాలు’ అంటారు సీతారాం.
మానుకోటలో డిగ్రీ కాలేజీ విద్యార్థులతోనే రచనలు చేయించి విద్యార్థులలోని సజనాత్మకతకు పదును పెట్టారు. ‘మా టీచర్’, ‘మానుకోట ముచ్చట్లు’, ‘కారేపల్లి కబుర్లు’ విద్యార్థులను ప్రోత్సహించే రచనలు ఆయ న ఉన్నత లక్షణానికి ప్రతిబింబాలు. ఉపాధ్యాయులకు కరదీపికలు. సీతారాంకు విద్యార్థులంటే ఎనలేని ప్రేమ. జీతాలు, ఇంక్రిమెంట్లు,హెచ్చరింపులు ధర్నాల్లో పొద్దుగడిపే ఉపాధ్యాయులను, అధ్యాపకులను మనం చూసి ఉంటాం. సీతారాం మాత్రం అలాకాదు.
పిల్లల భవిష్యత్తుకు తన వంతు సాయం చేయాలని నిరంతరం జ్వలిస్తూ ఉంటారు. తన విద్యార్థులను కనీసం ‘ఒరేయ్’ అని కూడా పిలవరు. ప్రతి విద్యార్థినీ గౌరవ వాచకంతో పిలుస్తారు. విద్యార్థులలో సమగ్రమైన అభివద్ధిని కాంక్షించే గొప్ప అధ్యాపకుడు సీతారాం. విద్యార్థుల విషయం లో సీతారాం చేసిన కృషి ఎనలేనిది. విద్యార్థుల మెదళ్లలోకి పూర్తిగా ఇంకిపోతారు సీతారాం. ఆయన విషయంలో మరొ క విషయం చెప్పాలి.
సాహిత్యపరమైన ఉపన్యాసాలివవ్వడం లో దిట్ట సీతారాం. ఆయనది అద్భుతమైన వాగ్ధాటి. కవిత్వం చదివినా, సాహిత్యం తాలూకు నిర్మాణ పద్ధతులు చెప్పినా, కళాశాలలో అధ్యాపకుడిగా పాఠాలు బోధించినా ఆయనకు ఆయనే సరిసాటి. ‘ప్రకృతిపై ప్రభావశీలంగా రచనలు చేస్తూ, పాటలు రాస్తున్న కవుల రచనలపై అద్భుతమైన విశ్లేషణ చేస్తూ, విమర్శ రాయడంలో ముందుంటారు సీతారాం. సాహిత్యరంగంలో ఏ కవి, ఏ రచయిత అయినా, తనకు తా ను గొప్పవారిగా భావిస్తారు.
అందుకు సీతారాం పూర్తిగా భిన్నం. ప్రకృతి పట్ల మమేకత, మనిషి పట్ల ఆవేదనను, జీవి తం పట్ల ప్రేమ పాటలున్నాయని, వాటిని కాపాడుకునేందుకు కాలంతో పోరాటం చేస్తున్న వారందరికీ ఆసరాగా నిలుస్తారు. ఆయన సా హిత్య సేవకు 2017లో రాష్ట్ర ప్రభుత్వ సాహిత్యపురస్కారమైన ‘ప్రజాకవి కాళోజీ నారాయణరావు’ అవార్డు అందుకున్నా రు. ఈ నెల ౩౦న ఆయ న హైదరాబాద్‌లోని తె లంగాణ సారస్వత పరిషత్‌లో ‘సామాజిక చైత న్య చింతలపల్లి నిర్మలాదేవి సారస్వత పురస్కా రం అందుకోనున్నారు. ఈసందర్భం గా సీతారాంకు ప్రత్యేక అభినందనలు.
హృదయాన్ని హత్తుకునే కవి
‘రక్తస్పర్శ’ కవితా సంపుటితో సీతారాం సాహితీ లోకానికి పరిచయమయ్యారు. తన కవి మిత్రులు అఫ్సర్, ప్రసేన్‌తో కలిసి సీతారాం ఈ కవితా సంపుటిని వెలువరించారు. ‘ఇదిగో ఇక్కడిదాకా’ పేరుతో ఆయన వెలువరించిన కవితాసంపుటి సంచలనం సృష్టించింది. ‘సన్నాఫ్ మాణిక్యం’ కవితా సంకలనం ఆయనకు కీర్తి ప్రతిష్ఠలను తెచ్చి పెట్టింది. సీతా రాం తన కవిత్వంతో చినుకులు నేలమీద కురిసినట్లు హృదయాలను కదలిస్తారు.
దుఃఖం ఎవరిదైనా తన హృదయం కన్నీటి సంద్రమవుతుంది. బాధలు ఎవరివైనా, అవి తనవే అన్నట్లు భుజమై పంచుకుంటారు. ఆయనొక దుఃఖిత కవి. ఎక్కడ, ఎవరికి గాయాలైనా నాలుగు అక్షరాల కవిత్వం రాయకుండా ఉండలేరు. అతని కవిత్వం మానవ హృదయం నిర్మా ణం. ‘వెళ్లిపోయానని/ మళ్లీ రానని/ నిరాశ వద్దు/ ఇదిగో ఇక్కడిదాకా/ ఈ మూలమలుపు వరకే / ఆ మూలమలుపు కాదది, ఆమూల మలుపు’ అంటారు కవి.
వనపట్ల సుబ్బయ్య
9492765358






