రేగోడులో విత్తన మేళా
24-06-2026 01:48 AM
రేగోడు, జూన్ 23: రేగోడు రైతు వేదికలో మండల వ్యవసాయాధికారి రాంప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విత్తనమేల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈనెల 30వ తేదీ వరకు రేగోడు రైతు వేదికలో విత్తనమేల కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ఏడు రకాల సన్నపు వరి విత్తన, కంది, పెసర, మినుము వంటి పప్పు దినుసుల విత్తనాలను సబ్సిడీపై అమ్మబడునున్నారు. గ్రామాల్లోని రైతులు విత్తల ఎంపికలో జాగ్రత్త వహిస్తూ ప్రభుత్వం నిర్ణయిం చిన ఏడు రకాల విత్తనాలను కొనుగోలు చేసేందుకు సులువుగా ఉంటుందన్నారు. నానో యూరియా వాడుతూ డబ్బును ఆదా చేసుకోవాలన్నారు. ఇందులో మండల నా యకులు, ఏఈఓలు, ఫర్టిలైజర్ ప్రోపరేటర్లు తదితరులు ఉన్నారు.






