14-02-2026 12:48:08 AM
డీఎస్పీ రాజశేఖర్ రాజు
మిర్యాలగూడ, ఫిబ్రవరి 13: రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గ నిర్దేశాల మేరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈనెల 16 వరకు ఆయా మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎలాంటి ర్యాలీలు, డీజేలకు, ఊరేగింపులకు ఎలాంటి అనుమతులు లేవని, అదేవిధంగా జనాలు ఒకే చోట గుమి కూడా వద్దని పోలీస్, సెక్యూరిటీ యాక్ట్లు అమలులో వాటిని ఎవరు అతిక్రమించవద్దని, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున దానిని ఎవరు అతిక్రమించవద్దని డీజే లకు ఎలాంటి అనుమతులు లేనందున డీజే యజమానులు వాటిని గమనించి నడుచుకోవాలన్నారు. అతిక్రమిస్తే డీజే లను షేర్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ఈనెల 16 తర్వాత పోలీసు ముందస్తు అనుమతు లతో పరిమిత సంఖ్యతో ఊరేగింపులు ర్యాలీలు చేపట్టాలన్నారు.