10 May, 2026 | 12:37 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

ఆరు నూరైనా మేయర్ పీఠం మాదే

14-02-2026 12:48 AM
  1. గిరిజనుడినే సీటులో కూర్చోబెడుతాం
  2. ఆర్భాటం లేకుండా ప్రచారం చేసి ప్రజల మనసు దోచాం 
  3. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు 

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఆరు నూరైనా తామే కైవ సం చేసుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివ రావు స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. హం గు, ఆర్భాటం, విమర్శలు లేకుండా ఎన్నికల ప్రచారం చేసి ప్రజల మనసును ఆకట్టుకున్నామన్నారు.

కొత్తగూడెం కార్పొరేషన్ ప్రజలు కమ్యూనిస్టు పార్టీకే జై కొట్టారన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తొలి ప్రథమ పౌరుడిగా గిరిజనుడికే కేటాయిస్తామన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి మద్దతు ప్రకటించిన మాట వాస్తవమని, ఇంకా కొందరు స్వతంత్ర అభ్యర్థులు తమకు మద్దతు ప్రకటించారని చెప్పారు. కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలు జరగలే దని స్పష్టం చేశారు. కార్పొరేషన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రారంభమైన కిడ్నాపుల పర్వం

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఫలితాలు వెలువడిన అనం తరం మేయర్ పదవిపై సీపీఐ, కాంగ్రె స్ తీవ్ర ప్రయత్నాలు చేపట్టాయి. ఎట్టకేలకు మేయర్ పీఠం దక్కించుకో వాలని రెండు పార్టీలు ఎత్తులు, జిత్తు లు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే కార్పొరేషన్ పరిధిలోని ఇద్దరు కార్పొరేటర్లు శుక్రవారం సా యంత్రం అదృశ్యం కావడం రాజకీయ వేడిని రేపింది.

స్వతంత్ర అభ్యర్థి 48వ డివిజన్ ధర్మ సోత్ నరేష్, 32 వ డివిజన్ బీఆర్‌ఎస్ అభ్యర్థి గుగులోతు రాంబాబులు అదృశ్యమయ్యా రు. స్వతంత్ర అభ్యర్థిని సీపీఐ నాయకులు కిడ్నాప్ చేశారని, బీఆర్‌ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ నాయకులు కిడ్నా ప్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పనమ రాఘవ తన అనుచరులతో రాంబా బు ఇంటి కి హుటాహుటిన చేరుకొని ఆందోళన చేపట్టారు.

దీంతో పోలీసులు రంగ ప్రవేశం కావడంతో అదృశ్యమైన రాంబాబు ఎట్టకేలకు బీఆర్‌ఎస్ శిబిరంలోకి చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్ అభ్యర్థి రాంబాబు కాంగ్రెస్ పార్టీతో మంతనాలు చేశారని, బీఆర్‌ఎస్ నాయ కులు అతని ఇంటి ముందు ఆందోళన చేయటంతో తిరిగి బీఆర్‌ఎస్ గూటికి చేరినట్లు తెలుస్తోంది. స్వతం త్ర అభ్యర్థి నరేష్ ఆచూకీ తెలియ రాలేదు.