ఎంజీఎం పాఠశాలలో ఘనంగా రంగుల దినోత్సవం
గణపురం,(విజయక్రాంతి): మండలంలోని చెల్పూర్ ఎంజీఎం హైస్కూల్ లో రంగుల దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా అనుభవిస్తామో రంగులు ప్రభావితం చేస్తాయి. పసుపు రంగు మన సంస్కృతిని, నారింజరంగు మన మెదడును ,ఎరుపు రంగు అభిరుచి, శౌర్యమును, పింకురంగు ఓర్పు, ప్రశాంతతను, ఆకుపచ్చ రంగు పర్యావరణాన్ని, నీలం రంగు నిజాయితీని తెలియజేస్తుందని విద్యార్థులకు ఉపాధ్యాయినిలు తెలియజేస్తూ పిల్లలతో వివిధ రకాల డ్రాయింగ్ పోటీలు నిర్వహించి, రంగురంగుల బొమ్మలు తయారు చేయించి నిజ జీవితంలో రంగుల ప్రాముఖ్యతను తెలియజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ పిల్లలు వస్తువులను క్రమబద్ధీకరించడానికి, నిర్వహించడానికి, వర్గీకరించడానికి సరిపోల్చడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుందని రంగులను గుర్తించడం వలన దృశ్యమాన ఆధారాలు,పదాల మధ్య జ్ఞానపరమైన సంబంధం రూపొందించడానికి తమను తాము వ్యక్తీకరించే సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్, ప్రిన్సిపల్ మధుకర్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






