11 May, 2026 | 9:52 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో సైన్స్ ఫేయిర్

01-03-2026 12:00 AM

వావిలాలపల్లి, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): వావిలాలపల్లిలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫేయిర్ వేడుకలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చైర్మన్ రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకొని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రిన్సిపాల్ ప్రియదర్శిని మాట్లాడుతూ  శాస్త్రీయ దృక్ప థం విద్యార్థుల అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు.విద్యార్థులు వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు, ప్రయోగాలను ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, సౌరశక్తి వినియోగం, సాంకేతిక ఆవిష్కరణలు వంటి అంశాలపై రూపొందించిన మోడల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సైన్స్ ఫేయిర్ విద్యార్థుల్లో పరిశోధనా తత్వాన్ని పెంపొందించడంతో పాటు సృజనాత్మకతకు వేదికగా నిలిచింది అని ప్రిన్సిపాల్ ప్రియదర్శిని  తెలిపారు.