11 May, 2026 | 11:56 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

గీతాంజలిలో ఘనంగా సైన్స్ దినోత్సవం

01-03-2026 12:00 AM

ఖమ్మం, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లోని గీతాంజలి పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు, డైరెక్టర్లు టి పద్మ, టి అరుణలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ టీవీ అప్పారావు జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థ్యులచే సైన్స్ ఎక్స్‌ఫో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో పర్యావరణానికి, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యానికి సంబంధించిన ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.