వంట మనిషి ఇంట్లోనే స్కూలు!
కబ్జాకు గురైన పాఠశాల భూమి
పాతికేళ్లుగా పక్కా భవనం లేదు
మహబూబాబాద్ జిల్లా బ్రహ్మంగారి తండాలో వరండాలోనే సాగుతున్న విద్యాబోధన
మహబూబాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): వచ్చే విద్యా సంవత్సరం నుంచి.. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన ప్రారం భించి, మంచి నాస్తా ఇవ్వడంతో పాటు వారంలో మూడు రోజులపాటు పాలు, మరో మూడు రోజులు రాగి జావా ఇచ్చి మెరుగైన విద్యాబోధన చేస్తామని రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి ఓవైపు ప్రకటించగా.. మరోవైపు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని బ్రహ్మంగారి తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కథ వేరుగా ఉంది.
పాతికేళ్లుగా వంట మనిషి ఇంట్లో ఆ పాఠశాలను నిర్వహిస్తున్నారు. పాతికేళ్ల క్రితం డిపెప్ పథకంలో బ్రహ్మంగారి తండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ పాఠశాలకు పక్కా భవనాన్ని నిర్మించలేదు. మధ్యాహ్న భోజనం వండి పెట్టే మహిళ ఇం ట్లోనే పాఠశాల నిర్వహణను నెట్టుకొస్తున్నా రు. మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతలు ఎవరు చేపట్టినా వారి ఇంట్లోనే ఆ పాఠశాల ఏర్పాటుచేస్తూ విద్యాబోధన సాగిస్తున్న దు స్థితి పాతికేళ్లుగా కొనసాగుతోంది.
గత ప్రభు త్వ హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో 40 లక్షల రూపాయల పైగా నిధు లు కేటాయించి రెండు గదులతో పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే గ్రా మీణ ఉపాధి హామీ పథకంలో కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్ నిర్మాణం చేపట్టాలని ప్రభు త్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రెవె న్యూ శాఖ బ్రహ్మంగారి తండా బీసీ కాలనీ వద్ద నాలుగు గుంటల స్థలాన్ని విద్యాశాఖకు పంచనామ చేసి అప్పగించింది.
దీనితో రెండు గదులు, వరండాతో పాఠశాల నిర్మాణాన్ని కాంట్రాక్టర్ చేపట్టాడు. పిల్లర్లు నిర్మిం చి స్లాబ్ వేయాల్సిన దశలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిపోయింది. దీనితో పాఠశాల నిర్మాణానికి సంబంధించిన బిల్లులో కాం ట్రాక్టర్‌కు ఒక పైసా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. ఫలితంగా పాఠశాల భవనం పూర్తవుతుందనుకున్న దశలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది.
ఇలాఉండగా, ప్ర భుత్వ పాఠశాలకు కేటాయించిన నాలుగు గుంటల భూమిలో రెండు గుంటల భూమి అన్యాక్రాంతం అయింది. ప్రస్తుతం పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్య మంలో విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా, మధ్యాహ్న భోజన నిర్వాహకు రాలు వినోద ఇంటి ఆవరణలో.. వరండాలో పరదా చాటున ఆ పదిహేను మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు.
రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మ హబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ఇటీవల కేసముద్రం పర్యటనకు వచ్చిన సందర్భంగా పాఠశాల పరిస్థితిపై విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మొరపెట్టుకున్నారు. అయినా పాఠశాల పరిస్థితులు ఏమాత్రం మార్పు రాలేదని వారు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు ప్రైవేటు పాఠ శాలలకు పిల్లలను పంపవద్దు.. ప్రభుత్వ పాఠశాలను మెరుగైన విధంగా తీర్చిదిద్దామని ప్రకటిస్తుండగా.. ఇంకోవైపు పాతికేళ్లు గా అధ్వానమైన పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాల నిర్వహణ కొనసాగుతున్నా, మార్పు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రభు త్వం స్థలం ఇచ్చినప్పటికీ, ఆ స్థలాన్ని కబ్జా చేయడం.. ప్రభుత్వ పాఠశాల నిర్వహణలో పరిస్థితి మారకపోవడం గమనార్హం. బ్ర హ్మం గారి తండా ప్రభుత్వ పాఠశాల అస్తవ్యస్త పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాఠశాలకు కేటాయించిన భూమికి హద్దులు నిర్ణయించి, అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తిచేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది.




