25 April, 2026 | 5:37 PM

ప్రైవేటు వద్దు.. ప్రభుత్వ పాఠశాల ముద్దు

25-04-2026 03:58 PM

నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు, 11వ వార్డు కౌన్సిలర్ సత్యం రాజురా సత్యం

ఖానాపూర్( విజయక్రాంతి): తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదువుపించి ఆర్థిక భారం భరిస్తున్నారని దానికంటే ప్రభుత్వ పాఠశాలలో ముద్దు అని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు, 11వ వార్డు కౌన్సిలర్ రాజుర సత్యం అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, అంగన్వాడీ కేంద్రంలో పాఠశాల గ్రాడ్యుయేషన్ డే, అన్నప్రాసన, గర్భిణీ స్త్రీలకు శ్రీమంత, కార్యక్రమంలో పాల్గొని మాట్లాడాను.

తమ ప్రభుత్వం విద్యా, ఆహారంపై శ్రద్ధ వహిస్తుందని విద్యార్థులు ప్రైవేటుకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సిడిపిఓ శ్రీలత, అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి, ఆర్పి సునీత, ఏఎన్ఎం పార్వతి ,లావణ్య, ఆశా కార్యకర్తలు సునీత ,వాణి, ఆయమ్మ జాదవ్ కౌసల్య, మహిళలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.