రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి
రమేష్ గౌడ్ పై ఆరోపణలు సరికావు
అతనిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి
ఏఎస్పీకి వ్యాధి పత్రాన్ని ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులు
లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీల అగ్రహానికి గురికాక తప్పదు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ పై కొందరు కుట్రపూరితంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తప్పుడు కేసులపై విచారణ జరిపి రమేష్ గౌడ్ పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. బహుజన బిడ్డ పల్లె రమేష్ గౌడ్ పై కొంతమంది స్వార్థం కోసం ఆరోపణలు చేస్తూ పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయ కక్షలతో కొంతమంది గ్రామంలోని నాయకుల ప్రోత్సవంతో కొందరు తప్పుడు కేసులు పెట్టారని విచారణ జరిపి కేసులేత్తివేయాలని ఏఎస్పీని కోరారు. విచారణ జరిపి కేసును పరిశీలిస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నేతలకు ఏఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బహుజన బిడ్డ కొంతమంది తమ స్వార్థం కోసం ఆరోపణలు చేస్తూ అతనిపై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే ఉప సంవారించుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామ సర్పంచ్ నరసింహ రెడ్డి ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రమేష్ గౌడ్ పై తప్పుడు కేసులు పెట్టించారని బహుజన సంఘ నేతలు పేర్కొన్నారు. బహుజనుల మేలు కోసం కృషి చేస్తున్న రమేష్ గౌడ్ పై రాజకీయ కక్షతో కొంతమందిని సర్పంచ్ నరసింహారెడ్డి రెచ్చగొట్టి తప్పుడు ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేయించారన్నారు. వెంటనే పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున రమేష్ గౌడ్ కు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. వ్యక్తిగత రాజకీయ కక్షలు ఉంటే అందులో బహుజను లను రెచ్చగొట్టి తప్పుడు కేసులు పెట్టించ వద్దని అన్నారు.






