7 August, 2026 | 9:50 AM

వర్షం పడితే కాలనీ ముంపే… పరిష్కారం ఎప్పుడు?

07-08-2026 08:57 AM

కల్లూరు, ఆగస్టు 07 (విజయక్రాంతి): చిన్నపాటి వర్షానికే కాలనీ అంతా నీటితో నిండిపోతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని యర్రబోయినపల్లి గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో ఈ సమస్య ఏళ్లుగా కొనసాగుతోంది. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం, ఇళ్లు లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోంది. చిన్న వర్షానికే ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు రాత్రంతా మేల్కొని నీటిని బయటకు తోడుకుంటూ గడపాల్సి వస్తోందని వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డ్రైనేజీ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.