మెడల్ గెలిచినా గుర్తింపు లేదా?
బ్యాడ్మింటన్‌ను పట్టించుకోరు
నా పిల్లలను ఈ ఆటకు దూరంగా ఉంచుతా
సాత్విక్ సాయిరాజ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, మే 7: భారత బ్యాడ్మింట న్ డబుల్స్ స్టార్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మన దేశంలో క్రికెట్‌కు, రాజకీయాలకు తప్పిస్తే మరే ఆటకూ గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాము థామస్ కప్‌లో పతకం గెలిచి స్వదేశానికి తిరిగొస్తే ఎయిర్‌పోర్టులో కనీసం పల కరించే వాళ్లు కూడా లేరని వ్యాఖ్యానించాడు.
క్రికెటర్లు వస్తే ఎయిర్‌పోర్టుకు వేలాది మంది తరలివస్తారనీ, తాము వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడల్ గెలిచినా కూడా ఎవ్వరూ పట్టించుకోరన్నాడు. ‘మేము జర్మనీ నుంచి హైదరాబాద్కు ఏడు గంటల ప్రయాణం చేసి వచ్చాం. థామస్ కప్ జెర్సీలు వేసుకుని ఉన్నా.. ఎవరూ మమ్మల్ని గుర్తించలేదు. అం దరూ ఐపీఎల్, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. కనీసం ’బాగా ఆడారు’ అని చెప్పే ఒక్క గొంతు కూడా వినిపించలేదు‘ అని సాత్విక్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లయిన హెచ్‌ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ వంటి వాళ్లు ఎయిర్పోర్ట్ బయట నిలబడి క్యాబ్‌లు బుక్ చేసుకుంటుం టే ఎంతో బాధ కలిగిందన్నాడు. తమకు కోట్ల రూపాయలు కావాలని అడగడం లేద నీ, కనీసం ఎవరైనా వచ్చి మీ ఆట బాగుంది అని అన్నా చాలన్నాడు. తనకు ఏపీ ప్రభు త్వం నుంచి కూడా సరైన సపోర్ట్ లేదని చె ప్పాడు. తన పిల్లల్ని భవిష్యత్తులో బ్యాడ్మింటన్ ఆడనివ్వకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. మానసికంగా బలంగా ఉంటేనే ఈ అవమానాన్ని తట్టుకోగలరని అన్నాడు.






