7 May, 2026 | 2:21 AM

టాప్ లేపారు

07-05-2026 01:26 AM

సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ లేపింది. పంజాబ్ కింగ్స్‌పై రివేంజ్ తీర్చుకుంది. కోల్ కతా చేతిలో ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లతో పాటు క్లాసెన్, ఇషాన్ కిషన్ విధ్వంసంతో భారీస్కోరు చేస్తే.. తర్వాత బౌలర్లు సమిష్టిగా రాణించి విజయాన్నందించారు.

  1. పంజాబ్‌పై సన్‌రైజర్స్ విజయం
  2. క్లాసెన్, ఇషాన్ కిషన్ విధ్వంసం
  3. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్

హైదరాబాద్, మే 6 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ కు దూరమైన సన్‌రైజర్స్ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి తిరిగి వచ్చాడు. ఎ ప్పటిలానే హైదారాబాద్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. అభిషేక్ శర్మ, ట్రా విస్ హెడ్ పంజాబ్ బౌలర్లను ఆటాడుకున్నారు. తొలి వికెట్‌కు 3.3 ఓవర్లలోనే 54 పరుగులు జోడించారు. భారీ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ శర్మ 13 బంతుల్లో 4 సిక్స ర్లు, 2 ఫోర్లతో 35 పరుగులకు ఔటయ్యాడు. 

తర్వాత ఇషాన్ కిషన్, హెడ్ రెండో వికెట్ కు 30 పరుగులు జోడించారు. హెడ్ 38 (3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటైన తర్వాత క్లాసెన్ ఎంట్రీతో సన్ రైజర్స్ స్కోరు బోర్డు టాప్ గేర్‌లో సాగింది. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 (2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔటై నా క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డితో కలిసి విధ్వంసాన్ని కొనసాగించాడు. వీరిద్దరూ చెలరేగి ఆడడంతో చివర్లో బౌండరీలు, సిక్స ర్ల వర్షం కురిసింది. క్లాసెన్ 43 బంతుల్లో 69 ( 3 ఫో ర్లు, 4 సిక్సర్లు) పరుగులకు చివరి బంతికి ఔటయ్యాడు.

ప్రస్తుతం క్లాసెన్ ఆరెంజ్ క్యాప్ రే సులో టాప్ ప్లేస్ కు దూసుకొచ్చా డు. చివర్లో నితీశ్ రెడ్డి 13 బంతు ల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 ప రుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20  ఓ వర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఫీల్డింగ్ లో పంజాబ్ పలు క్యాచ్ లను జారవిడవడం కూడా సన్ రైజర్స్‌కు బాగా కలిసొచ్చింది. భారీ టార్గెట్ అయినా ఫ్లాట్ వికెట్ కావడంతో పంజాబ్ కింగ్స్ చెలరేగుతుందని అంతా అనుకున్నారు. అయితే సన్ రైజర్స్ బౌలర్లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

తొలి ఓవర్ నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలో పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (1), ప్రభ్ సిమ్రన్ సింగ్ (3) పరుగులకే వెనుదిరిగారు. శ్రేయాస్ అయ్యర్ (3) కూడా త్వరగానే ఔటవడంతో పంజాబ్ పై ఒత్తిడి పెరిగింది. స్టోయినిస్(28)ధాటిగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. సుయాన్ష్ (25), శశాంక్ సింగ్ నిరాశపరిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూపర్ కన్నోలీ మాత్రం పోరాడాడు. కూపర్ కన్నోలీకి మరో హిట్టర్ తోడుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది.

ఎందుకంటే కన్నోలీ చివర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కూపర్ కన్నోలీ పోరాడడంతోనే పంజాబ్ స్కోరు 200 దాటగలిగింది. కన్నోలీ 59 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 107 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 2, శివాంగ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టారు.

స్కోరు బోర్డు 

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 235/4 ( క్లాసెన్ 69, ఇషాన్ కిషన్ 55, హెడ్ 38, అభిషేక్ శర్మ 35 ; చాహల్ 1/32, పెర్గ్యూసన్ 1/41, అర్షదీప్ 1/43 )

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 202/7 ( కూపర్ కన్నోలీ 107 నాటౌట్, స్టోయినిస్ 28, సుయాన్ష్ 25 కమిన్స్ 2/34, శివాంగ్ కుమార్  2/45 )