9 May, 2026 | 9:18 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

శాతవాహన ఫార్మసీ అధ్యాపకురాలు అశ్వినికి డాక్టరేట్

26-02-2026 01:14 AM

కొత్తపల్లి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): మానవ శరీరంలో హైపర్ టెన్షన్ (బిపి) నియంత్రణలో సాధారణ టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా ఈప్రోనియోసోమ్స్ పద్దతి పై చేసిన పరిశోధనకు గాను శాతవాహన ఫార్మసీ విభాగానికి చెందిన అధ్యాపకురాలు జె అశ్విని చేసిన పరిశోదనకు అనురాగ్ విశ్వావిద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగం డా క్టరేట్ ప్రదానం చేసింది.

అనురాగ్ విశ్వవిద్యాలయ ఫార్మాసీ విభాగములో డీన్ డా క్టర్ వసుధా భక్షి పర్యవేక్షణలో ‘ఫార్ములేషన్ డెవలప్మెంట్, ఆప్టిమైజేషన్ అండ్ ఇవాల్యూయేషన్ ఆఫ్ ప్రోనియోసోమ్స్ ఆఫ్ యాంటి హైపెర్టిన్సివ్ డ్రగ్స్‘ అంశంపై తన పరిశోధన చేసారు. డాక్టరేట్ సాధించిన జె అశ్విని కరీంనగర్ ఎల్‌ఎండి సమీపంలోని శాతవాహన ఫార్మసీ కళాశాలలో గత 12 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సంద ర్భంగా ఆమెను ఎస్ యు వీసీ ఉమేష్ కుమార్, అధ్యాపకులు అభినందించారు.